: రేవంత్ అరెస్ట్ ఓ కుట్ర... కేసీఆర్ పాత్ర ఉంది... డీజీపీని కలుస్తున్నాం: ఎర్రబెల్లి
తమ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం వెనుక కుట్ర దాగుందని టీటీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష పూరిత రాజకీయం ఉందని ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెనే రేవంత్ వద్దకు వెళ్లారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాట్లాడటానికి టీటీడీపీ నేతలంతా కలసి డీజీపీని కలవబోతున్నామని చెప్పారు. మరోవైపు, ఏసీబీ డీఎస్పీ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీటీడీపీ నేతలు ఇప్పటికే, తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఆయన వద్ద ఎలాంటి డబ్బు లేదని బాబుకు తెలిపారు. చట్ట ప్రకారం మీరంతా ముందుకు వెళ్లండని, ఈ సందర్భంగా తమ నేతలకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది.