: మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ
నైరుతి రుతుపవనాల రాకలో ఆలస్యం వల్లే అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో, దక్షిణ కోస్తాలో మరో రెండు రోజులు, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు కొనసాగుతాయని చెప్పింది. జూన్ 3 తర్వాత రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ బారిన పడి... ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది మృత్యువాత పడ్డారు.