: మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేసిన ఘనత కేసీఆర్ దే: మంత్రి జూపల్లి
ఎన్నికల మేనిఫెస్టోలో కూడా లేని హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడానికి కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబురాలు అంబరాన్ని అంటాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.