: రహస్య ప్రదేశంలో టీడీపీ క్యాంప్... మాధవరం వ్యవహారంతో అలర్ట్
తమ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ అధిష్ఠానం అలర్ట్ అయింది. తెలంగాణ శాసనమండలికి రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జంప్ జిలానీలకు అడ్డుకట్ట వేయాలనే కోణంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, ఒక రహస్య ప్రదేశంలో క్యాంప్ ఏర్పాటు చేసి... అందులో తమ 10 మంది ఎమ్మెల్యేలను ఉంచింది. తమ ఎమ్మెల్యేలకు బయటవారితో సంబంధం లేకుండా... ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేయించారు క్యాంపు నిర్వాహకులు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి తమ ఎమ్మెల్యేలను నేరుగా క్యాంపు నుంచి అసెంబ్లీకి తీసుకురానున్నారు.