: ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై జగన్ విమర్శలు
వైకాపా అధినేత జగన్ టీడీపీని విమర్శించడానికి ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ను బాగానే ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ట్విట్టర్లో టీడీపీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు చేసిన మోసం వల్ల మహిళలు అప్పుల్లో కూరుకుపోయి, కంటతడి పెడుతున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలను చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే... ఉద్యోగాలిస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని చంద్రబాబు చెప్పారని... ఇప్పుడు మోసం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మెడలు వంచడానికి అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.