: ఆ ముస్లిం కుర్రాడికి అదానీ గ్రూప్ లో ఉద్యోగం వచ్చింది!


ముస్లిం అన్న కారణంగా జేషన్ అలీఖాన్ అనే ఎంబీఏ విద్యార్థికి ఉద్యోగం ఇవ్వడానికి ముంబైలోని హరే కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిరాకరించిన సంగతి తెలిసిందే. దేశంలో కలకలం రేపిన అతని ఉద్యోగం ఉదంతానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. తాజాగా ఆ యువకుడికి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన అదానీ గ్రూప్ ఉద్యోగం ఇచ్చింది. హరే కృష్ణ ఉదంతం తరువాత జేషన్ కు పెద్ద సంఖ్యలో ఆఫర్లు వచ్చాయి. అలా వచ్చిన ఆఫర్ లెటర్స్ తో తన మెయిల్ బాక్స్ నిండిపోయిందని జేషన్ చెప్పాడు. పలు ఇంటర్యూలకు హాజరైన తాను ఆదానీ కంపెనీకు ఎంపికైనట్లు తెలిపాడు. కాగా, అదానీ కంపెనీ దీనిపై మాట్లాడుతూ, టాలెంట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము తప్ప, తెగలు, కులాలు, మతాలను పట్టించుకోమని చెప్పింది.

  • Loading...

More Telugu News