: కటకటాల వెనక్కి అవినీతి అధికారి


అవినీతి అధికారుల బరితెగింపుకి నిదర్శనం ఈ సంఘటన. గత మార్చిలో ఓ కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ట్రాన్స్‌కో అసిస్టెంట్ డివిజన్ ఇంజినీర్ చంద్రశేఖర్‌ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీంతో ఆయనను అధికారులు కటకటాల వెనక్కి పంపారు. అదే నెలాఖరున న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. జైలు కెళ్లిన ఆయన తన వైఖరి మార్చుకోకపోగా మరింత బరితెగించాడు. తనపై ఫిర్యాదు చేసిన వెంకటేశప్పను బెదిరించడం ప్రారంభించాడు. అతని ఆగడాలు భరించలేకపోయిన బాధితుడు, ఏసీబీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్ దృష్టికి తీసుకువెళ్లాడు. ఆయన ఫిర్యాదును న్యాయస్థానం ముందు ఉంచడంతో, చంద్రశేఖర్ కు బెయిల్ రద్దు చేస్తూ న్యాయస్థానం అతనిని మరోసారి కటకటాల వెనక్కి పంపింది.

  • Loading...

More Telugu News