: మరో 24 గంటల పాటు ఎండల తీవ్రత!: వాతావరణ శాఖ
మరో 24 గంటలపాటు ఎండల తీవ్రత ఎప్పట్లానే కొనసాగనుందని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలోనే ఉంటాయని, వేడిగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. కాగా, రాష్ట్రంలోని పలు చోట్ల 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదవుతున్నట్టు సమాచారం. సాధారణం కంటే రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆంధ్రా, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.