: ఐదు రోజుల పర్యటనకు బయల్దేరనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐదురోజుల విదేశీ పర్యటనకు నేడు బయల్దేరనున్నారు. జూన్ 2వ తేదీ వరకు ఆయన స్వీడన్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా స్వీడన్ రాజు, రాణితో సమావేశం కానున్నారు. మర్యాదపుర్వకంగా స్వీడన్ ప్రధాని, పార్లమెంట్ స్పీకర్, ప్రతిపక్ష నాయకుడిని ప్రణబ్ కలవనున్నారు. పర్యటన సందర్భంగా రాష్ట్రపతి స్వీడన్ లో ఉన్న స్మార్ట్ సిటీలు, యూరోప్ లో అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఉప్సాలను సందర్శించనున్నారు. అలాగే పలు అంశాలపై స్వీడన్ తో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోనున్నారు. అనంతరం ఆయన బెలారస్ వెళ్లనున్నారు. బెలారస్ అధ్యక్షుడితో సమావేశమైన అనంతరం వారిద్దరూ కలిసి వ్యాపారవేత్తల సంయుక్త సమవేశం నిర్వహించనున్నారు. జూన్ 4న ప్రణబ్ తిరిగి భారత్ కు చేరుకొంటారు. రాష్ట్రపతి వెంట కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్ అహీర్, ఎంపీ గులాం నబి ఆజాద్, అశ్వీని కుమార్, దేశంలోని ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన ఏడుగురు వీసీలు, 60 మంది వ్యాపారవేత్తలు వెళ్లనున్నారు.