: నేను సమంత కాలేను...ఇంకొకరు రకుల్ కాలేరు: రకుల్ ప్రీత్ సింగ్


తనను సమంతతో పోల్చడం సరికాదని టాలీవుడ్ లో దూసుకుపోతున్న రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. పండగచేస్కో సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న రకుల్ మాట్లాడుతూ, సమంత తన సీనియర్ అని, ఆమెతో పోల్చడం వినడానికి బాగున్నా ఆమె స్థానం ఆమెదేనని, అలాగే రేపు మరో నటి వచ్చి రకుల్ ప్రీత్ సింగ్ స్థానం భర్తీ చేయలేదని స్పష్టం చేసింది. సినీ పరిశ్రమలో ఎవరి స్థానం వారిదేనని, హిట్లు, ఫ్లాపులు రావచ్చు తప్ప, ఒకరు పోషించిన పాత్రను ఇంకొకరు అదే స్థాయిలో పోషించలేరని రకుల్ తెలిపింది. పండగ చేస్కో కుటుంబం మొత్తం చూడదగ్గ సినిమా అని, సినిమాలో సానుకూల అంశాలు చాలా ఉన్నాయని చెప్పింది.

  • Loading...

More Telugu News