: నెలలో ఒకరోజు పాలు ఉచితంగా సరఫరా చేస్తానంటున్న విజయా డెయిరీ
ప్రముఖ పాల సరఫరాదారు విజయా డెయిరీ కొత్త పథకం ప్రారంభించింది. నెల రోజుల పాటు పాలను కొనుగోలు చేసేవారికి ఒక రోజు పాలను ఉచితంగా అందజేయనున్నట్టు తెలిపింది. విజయా డెయిరీకి పోటీగా పలు డెయిరీలు మార్కెట్ లోకి దూసుకొస్తుండడంతో కొత్త పథకం ప్రకటించింది. ఈ పధకం ప్రకారం నెల పాలకు సంబంధించిన బిల్లు ముందుగా చెల్లించిన వినియోగదారులకు ఆ నెలలో చివరి రోజు పాలను ఉచితంగా విజయా డెయిరీ అందజేస్తుందని ప్రకటించింది. మీసేవ, ఆన్ లైన్ సౌకర్యం ద్వారా బిల్లులు చెల్లించినా ఈ ఆఫర్ వర్తిస్తుందని విజయా డెయిరీ తెలిపింది.