: నాలుగు కేజీల బంగారం చోరీ
హైదరాబాదులోని హుమయూన్ నగర్ లో భారీ చోరీ చోటుచేసుకుంది. జ్యుయలరీ షాపు యజమానిని అటకాయించిన దుండగులు అతని వద్ద నుంచి నాలుగు కేజీల బంగారం అపహరించారు. దీంతో లబోదిబోమంటూ జ్యుయలరీ షాపు యజమాని పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.