: శ్వేత సౌధంలో రెహమాన్ డాక్యుమెంటరీ


ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జీవిత విశేషాలతో రూపొందిన 'జయహో' డాక్యుమెంటరీని అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శన నిమిత్తం రెహమాన్ శ్వేత సౌధానికి వెళ్లారు. ఈ విషయం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఉమేష్ అగర్వాల్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ రెహమాన్ వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను ప్రతిబింబిస్తుంది. కాగా, రెహమాన్ గతం స్పూర్తిమంతమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే. డాక్యుమెంటరీ ప్రదర్శన ముగియగానే వియన్నాలోని వోల్ఫ్ ట్రాప్ లో రెహమాన్ సంగీత విభావరి నిర్వహించారు.

  • Loading...

More Telugu News