: ఎల్టీటీఈ మళ్లీ పురుడుపోసుకోవచ్చు జాగ్రత్త!: రాజపక్సె
ఎల్టీటీఈ మళ్లీ పురుడుపోసుకోవచ్చని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద్ర రాజపక్సె హెచ్చరించారు. శ్రీలంకలోని అనురాధపుర పట్టణంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈ పురుడుపోసుకునే అవకాశం ఉందని అన్నారు. మనం సుఖశాంతులతో ఉండాలంటే అలా జరగకూడదని కాంక్షిద్దామని ఆయన అన్నారు. అయితే ఎల్టీటీఈ పునరుజ్జీవనం పొందుతుందేమోననే అనుమానం కలుగుతోందని ఆయన చెప్పారు. కాగా, రాజపక్సె శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఎల్టీటీఈని కూకటివేళ్ళతో పెకిలించివేశారు.