: ప్రస్తుతానికి జపాన్ సేఫ్
7.8 తీవ్రతతో భూకంపం సంభవించినప్పటికీ, జపాన్ ప్రస్తుతానికి సేఫ్ గా ఉంది. పుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ఎలాంటి అసాధారణ స్థితి లేదని తెలిపింది. టోక్యో-ఒసాకా మధ్య తిరిగే బుల్లెట్ రైళ్లను నిలిపేసినట్టు జపాన్ విద్యుత్ సంస్థ టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కో వెల్లడించింది. టోక్యో విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని, విమాన సర్వీసులు నడుస్తున్నాయని జపాన్ లోని బ్రాడ్ కాస్టర్ ఎన్ హెచ్ కే వెల్లడించింది. కాగా భూకంపం కారణంగా టొక్యోలోని భవనాలు ఒక నిమిషం పాటు ఊగిసలాడాయని అధికారులు వెల్లడించారు. భవనాలు ఊగిసలాట పలు సీసీ టీవీ పుటేజ్ లలో కనిపించింది.