: ఏనాడైనా చంద్రబాబు విపక్షాలను పట్టించుకున్నారా?... ఆయనది దిగజారుడు రాజకీయం: సీపీఐ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. విపక్షాలను రాక్షసులతో పోల్చడం ఆయనకు తగదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా, ఏనాడూ ఆయన విపక్షాలను పట్టించుకోలేదని... ఏ సమస్యపై కూడా ఒక్క అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించలేదని విమర్శించారు. చంద్రబాబుకు విపక్షాలపై గౌరవం లేదని... నిజంగా గౌరవం ఉంటే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. రాజధాని నిర్మాణంపై విపక్షాలతో కూడా చర్చించాలని సూచించారు.