: ప్రత్యేక హోదా రాదు...అలాగని ఆందోళన చేయడానికి సిద్ధంగా లేను: జేసీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ వెళ్లడం, ప్రత్యేక హోదా కోసం అక్కడి బీజేపీ నేతలను కలవడం మామూలేనని అన్నారు. ఎవర్ని కలిసినా, ఎన్ని చేసినా ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చేస్తే కేంద్రం దిగిరావాల్సిందేనని, తెలంగాణ అలాగే ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఆందోళనలు చేసేందుకు తాను సిద్ధంగా లేనని జేసీ స్పష్టం చేశారు. ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రత్యేక హోదాపై విమర్శలు చేయడం వింతగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. గురివిందగింజల్లా కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలను విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News