: సూట్ కేసుల ప్రభుత్వం కంటే... సూటు, బూటు ప్రభుత్వమే మేలు: మోదీ


అధికారాన్ని కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పు రాలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ సాగించిన పాలన వల్లే దేశం పేదరికంలో మగ్గుతోందని మండిపడ్డారు. పేదల పక్షాన పోరాడతామని చెబుతున్న మీరు నిజంగా పేదల పక్షమే అయితే... దేశంలో పేదరికాన్ని ఎందుకు అంతం చేయలేకపోయారని ప్రశ్నించారు. ఎన్డీయేది సూటు, బూటు పాలన అంటూ విమర్శిస్తున్నారని... సూట్ కేసుల పాలన కంటే తమ పాలనే మంచిది కదా? అన్నారు. తమను విమర్శించే అర్హత కాంగ్రెస్ కు లేదని... సొంత మనుషులకు బొగ్గు గనులను కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ సొంతమని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News