: బొత్స పార్టీ వీడుతారని నేననుకోవట్లేదు: సి.రామచంద్రయ్య
పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య స్పందించారు. కాంగ్రెస్ లో బొత్స ఓ మంచి నాయకుడని, ఆయన పార్టీని వీడుతారని తాననుకోవడం లేదని మీడియా ముఖంగా అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో టీడీపీ మహానాడుపై ఆయన మాట్లాడుతూ, మహానాడు అంతా ఆత్మస్తుతి, పరనిందలా సాగిందని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఉదయం ఒకలా, సాయంత్రం మరోలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని రామచంద్రయ్య విమర్శించారు.