: భీమవరంలో నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సన్మానం


ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సన్మానం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఏపీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయన చేతుల మీదుగా బాలును సన్మానించనున్నారు. అలాగే, గాయని సునీతకు పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. స్థానిక డీఎన్ఆర్ ఆర్ట్స్ కళాశాలలో చైతన్య భారతి సంగీత, నృత్య పోటీలు ఈ రోజు జరగనున్నాయి. ఇందులో భాగంగానే, బాలుకు సన్మానం చేస్తున్నారు. నిన్న సాయంత్రమే భీమవరం చేరుకున్న బాలు దంపతులు... మావూళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News