: పాక్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న స్టేడియం సమీపంలో ఆత్మాహుతి దాడి


ఉగ్ర దాడులతో పాక్ రక్తమోడుతోంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో లాహోర్ లోని గడాఫీ స్టేడియం సమీపంలో ఓ సూసైడ్ బాంబర్ తనను తాను పేల్చి వేసుకున్నాడు. ఈ ఘటనలో, ఓ పోలీసు అధికారితో పాటు మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు పోలీసులు, ఒక పౌరుడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి గడాఫీ స్టేడియంను టార్గెట్ గా చేసుకుని వస్తున్నాడని... దీంతో, అనుమానంతో అతడిని పోలీసు అధికారి అడ్డుకోవడంతో, తనను తాను పేల్చివేసుకున్నాడని అధికారుల తెలిపారు. ఘటన జరిగిన వెంటనే, దీనిపై స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు... ఇది ట్రాన్స్ ఫార్మర్ పేలుడు వల్ల సంభవించిందని తెలిపింది. ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా తొలుత ప్రసారం చేసిన లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా... ఆ తర్వాత కేవలం ట్రాన్స్ ఫార్మర్ పేలడం వల్లే పేలుడు సంభవించిందని తెలిపింది. అయితే, మ్యాచ్ పూర్తయిన తర్వాత పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి పర్వేజ్ రషీద్ దీనిపై స్పందిస్తూ, ఇది ఆత్మాహుతి దాడేనని స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో, స్టేడియంలో దాదాపు 20 వేల మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News