: గుజరాత్ పోలీసులకు హ్యార్లీ డేవిడ్ సన్ బైకులు


గుజరాత్ పోలీసులు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. పెట్రోలింగ్ నిమిత్తం ఎంపిక చేసిన పోలీసులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం హైఎండ్ బైకులను ఇవ్వనుంది. లగ్జరీ హైఎండ్ బైక్ మేకర్ హ్యార్లీ డేవిడ్ సన్ నుంచి 9 'స్ట్రీట్-750' బైకులను కొనాలని నిర్ణయించింది. ఇప్పటికే అహ్మదాబాదులోని హ్యార్లీ డేవిడ్ సన్ డీలర్ ఆరు 'స్ట్రీట్-750'లను పోలీసు శాఖకు డెలివరీ అందించారు. ఈ బైకుల ధర ఒక్కొక్కటీ రూ. 4.32 లక్షలు. పోలీసు అవసరాల నిమిత్తం ఈ బైకులకు కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఇండియాలో పోలీసు విభాగానికి ఈ తరహా బైకులు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. 'క్విక్ రెస్పాన్స్ యాక్షన్ టీమ్' సభ్యులకు ఈ బైకులను ఇవ్వనున్నారు. ఇందులో 750 సీసీ వీ-ట్విన్ ఇంజన్ ఉంటుంది. 13.1 లీటర్ల ఇంధన ట్యాంకు, 218 కిలోల బరువుండే బైకు ఆరు సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

  • Loading...

More Telugu News