: ఏసీ కొనలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య


తాను కోరినట్టుగా ఎయిర్ కండిషనర్ ను కొనలేదని బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రాజమండ్రిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక జాంపేట, మఠం వీధికి చెందిన నందారపు శివజ్యోతి ఇటీవలే బీకాం ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసింది. ఆమె తన స్నేహితురాలి ఇంట్లో కొత్త ఏసీ కొనడం చూసి, తమ ఇంట్లో కూడా ఏసీ పెట్టించాలని తల్లిదండ్రులను కోరింది. ఆర్థిక స్తోమత కారణంగా వారు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె నిన్న తన తల్లితో వాగ్వాదానికి దిగింది. ఆపై రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు వదిలింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News