: రాజీనామా చేసిన మారిషస్ అధ్యక్షుడు


మారిషస్ అధ్యక్షుడు కైలాష్ పుర్యాగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను జాతీయ అసెంబ్లీ స్పీకరుకు ఆయన పంపినట్టు క్సిన్హువా న్యూస్ ఏజన్సీ నేడు వెల్లడించింది. కైలాష్ మారిషస్ అధ్యక్షుడిగా 2012లో బాధ్యతలు చేపట్టారు. తాను జనవరిలోనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావించానని, అయితే, తన నిర్ణయాన్ని ఐదు నెలల పాటు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరిందని ఓ ప్రైవేటు రేడియో చానల్ లో ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆయన రాజీనామా తరువాత దేశానికి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రముఖ సైంటిస్టుగా గుర్తింపున్న అమీనా గురీబ్ ఫాకిమ్ తదుపరి ప్రెసిడెంట్ కానున్నారు.

  • Loading...

More Telugu News