: రాయలసీమలో ఎండల తీవ్రత ఇలా ఉంది


తెలుగు రాష్ట్రాలు రోహిణీ కార్తె ఎండలకు మండిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బయటకి రావాలంటే భయపడుతున్నారు. రాయలసీమలో వీటి తీవ్రత మరికాస్త ఎక్కువగానే ఉందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ ఎండల తీవ్రతకు మనుషులే కాదు, జంతువులూ విలవిల్లాడిపోతున్నాయి. ఎండవేడిమికి తాళలేక తిరుపతి జూలో సింహం మరణించింది. కాగా, వయసు పైబడటం వల్లే సింహం మృతి చెందిందని జూ అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఎండల తీవ్రతకు నామాలకోడితో పాటు రెండు జింకలు కూడా మృతి చెందాయి.

  • Loading...

More Telugu News