: ఘనంగా అల్లరి నరేష్ వివాహం


టాలీవుడ్ యువహీరో అల్లరి నరేష్ వివాహం చెన్నైకి చెందిన విరూపతో వైభవంగా జరిగింది. హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అల్లరి నరేష్ తన సమకాలీన హీరోలందరికీ మంచి మిత్రుడు. సహనటులతో మంచి సంబంధాలు నెరపే నరేష్ వివాహ వేడుకకు యువహీరోలంతా హాజయ్యారు. వీరి అల్లరితో వేడుకను మరింత ఆహ్లాదకరంగా మార్చారు. వేద మంత్రోచ్చారణ నడుమ విరూప మెడలో నరేష్ మూడుముళ్లు వేశాడు.

  • Loading...

More Telugu News