: సల్మాన్ విమానాన్నేమీ కూల్చలేదే?: రాఖీ
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'హిట్ అండ్ రన్' కేసులో తీర్పు వచ్చిన కొన్ని వారాల తర్వాత ఐటెం బాంబ్ రాఖీ సావంత్ స్పందించింది. సల్మాన్ అమాయకుడని పేర్కొంది. ఘటన నేపథ్యంలో సల్మాన్ ను సమర్థించింది. "ఐ లవ్యూ సల్మాన్ ఖాన్" అంటూ అభిమానం ప్రదర్శించింది. సల్మాన్ కు శిక్ష పడితే చిత్ర పరిశ్రమ ఎంతో నష్టపోతుందని అభిప్రాయపడింది. ఒకవేళ సల్మాన్ గనుక విమానాన్ని కూల్చితేనో, ఎక్కడన్నా బాంబు పెడితేనో, ఏదన్నా బిల్డింగ్ ను కూలదోస్తేనో అప్పుడు చట్టానికి పూర్తి మద్దతు ప్రకటిస్తానని ఈ శృంగార తార పేర్కొంది.