: హద్దు మీరిన పెళ్లికొడుకు తండ్రి... పెళ్లి కేన్సిల్ చేసిన పెళ్లికూతురు


వావి వరసలు మరచిపోయి ప్రవర్తిస్తే ఏమవుతుందో ఓ పెళ్లి కొడుకు తండ్రికి ఒళ్లు హూనమయ్యేలా తెలిసొచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే, అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఫరూఖాబాద్ జిల్లాలో నాగల్ ఖైర్ బాంద్ గ్రామానికి చెందిన రీచాకు ఈటాహ్ జిల్లా నెహ్రూనగర్ కు చెందిన రాజేష్ అనే యువకుడితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం మరికొంత సేపట్లో జరగనుందనగా జైమాల్ కార్యక్రమంలో భాగంగా అందరూ నృత్యాలు చేశారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు రాజేష్ తండ్రి బాబూరావు పెళ్లి కుమార్తె రిచాకు సోదరి వరస అయ్యే యువతి బుగ్గమీద చటుక్కున ముద్దు పెట్టాడు. అంతే... సీన్ మొత్తం రివర్సైంది. వావి వరుసలు లేని కుటుంబంలోకి వెళ్లనని యువతి పట్టుబట్టింది. దీంతో బాబూరావును చితక్కొట్టిన పెళ్లి కుమార్తె బంధువులు, పెళ్లి కొడుకును కూడా నిర్బంధించి పెళ్లి ఖర్చులు చెల్లిస్తే కానీ కదలడానికి వీల్లేదని ఆర్డరేశారు. దీంతో 30 వేల రూపాయలు చెల్లించిన రాజేష్, బాబూరావు సపరివారం అక్కడి నుంచి బతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించారు.

  • Loading...

More Telugu News