: విమాన ప్రయాణికులకు పిజ్జా పార్టీ
విమానం ఫుల్ అయిపోయింది. గమ్యస్థానం చేరడానికి బయల్దేరింది. మధ్యలో తుపాను విమానాన్ని దారి మళ్లించింది. ఈ దశలో సాంకేతిక కారణాలతో విమాన ప్రయాణం మరికాస్త ఆలస్యమైంది. ఈ దశలో ప్రయాణికుల చిరాకు పోగొట్టేందుకు పైలట్ పిజ్జా ఇచ్చాడు. ఫిలడెల్ఫియా నుంచి అట్లాంటా వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమానం తుపాను కారణంగా నాక్స్ విల్లే ఎయిర్ పోర్టులో దిగింది. అక్కడి ఎయిర్ పోర్టులో రద్దీ కారణంగా డెల్టా ఎయిర్ లైన్స్ విమానానికి క్లియరెన్స్ లభించలేదు. సుమారు మూడు గంటలపాటు విమానంలోనే ప్రయాణికులు ఉండిపోయారు. దీంతో ప్రయాణికుల్లో అసహనం బయటపడింది. పైలట్, విమాన సిబ్బంది మీద చిరాకు చూపించడం మొదలు పెట్టారు. ప్రయాణికుల అసహనం గమనించిన పైలట్ విమాన సంస్థకు విషయం వివరించాడు. దీంతో డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలోని ప్రయాణికులందరికీ పిజ్జా పార్టీ ఇచ్చింది. దీంతో విసుగు మర్చిపోయిన ప్రయాణికులు డెల్టా ఎయిర్ లైన్స్ ను పొగడ్తల్లో ముంచెత్తారు.