: దారితప్పిన మహారాష్ట్ర గవర్నర్ హెలికాప్టర్
మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పిపోయింది. దీంతో, కాసేపు కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళ్తే, ముంబై నుంచి నాందేడ్ జిల్లా కిన్వట్ కు బయల్దేరిన సమయంలో, ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాలు తెలంగాణలోనే చక్కర్లు కొట్టిన తర్వాత హెలికాప్టర్ ను సరైన ప్రాంతంలోకి తీసుకువచ్చారు. దీంతో, అప్పటిదాకా టెన్షన్ పడ్డ అధికారులు, భద్రతాసిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.