: దానం నివాసానికి తరలివెళ్లిన కాంగ్రెస్ అగ్రనేతలు
కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్ తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వలేదని అధిష్ఠానంపై అలకబూనిన విషయం తెలిసిందే. తనను కాదని ఆకుల లలితకు ఎమ్మెల్సీ స్థానం కేటాయించారని దానం గుర్రుగా ఉన్నారు. అయితే, హైదరాబాదులో మంచి పట్టున్న దానం విలువ కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. అందుకే, ఆయనను బుజ్జగించేందుకు పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి, ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, కేవీపీ రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ తదితరులు దానం ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో, అలక మంచిది కాదంటూ ఆయనకు నచ్చజెప్పారు. ఆయన సేవలను అధిష్ఠానం గుర్తించిందని, సముచిత రీతిలో గౌరవిస్తుందని వివరించారు.