: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడులో ఈరోజు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించి చంద్రబాబు తరపున నిన్న(గురువారం) ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వాటిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య నేతలు, పోలిట్ బ్యూరో సభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు టీడీపీ వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు అనివార్యమైంది. ఈ క్రమంలో పార్టీకి ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు నేటినుంచి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.