: రాహుల్ లా రెండు నెలలు సెలవు పెట్టి వెళ్లడం లేదు: రాజ్ నాథ్ సింగ్
బీజేపీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అనేకసార్లు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ పై కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్ నాథ్ సింగ్ విరుచుకుపడ్డారు. 'పదేళ్ల కాలంలో దేశాన్ని దోచుకుతిన్న పార్టీ కాంగ్రెస్' అని మండిపడ్డారు. ప్రధాని మోదీ పర్యటనలు దేశానికి ఉపయోగపడుతున్నాయని... దేశ ప్రతిష్ట పెరుగుతోంది అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీలా రెండేసి నెలలు సెలవు తీసుకుని ఎక్కడికీ, ఎప్పుడూ వెళ్లలేదంటూ ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ తో నరేంద్ర మోదీ భేటీ కావడంపై రాహుల్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, రాజ్ నాథ్ సింగ్ పైవిధంగా స్పందించారు.