: తెలుగుదేశం పార్టీకి నాని విరాళం అరకోటి
తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని అరకోటి విరాళం ఇచ్చారు. హైదరాబాదులోని గండిపేటలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో మూడోరోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని ట్రావెల్స్ బస్సుల్లో టీడీపీ కార్యకర్తలకు పది శాతం రాయితీ కల్పించడాన్ని ప్రస్తావించిన చంద్రబాబు, ఆయనను అభినందించారు.