: హైదరాబాద్ లోని ఏపీ ఉద్యోగులు నవనిర్మాణ దీక్షలో పాల్గొనాలి: సీఎస్ కృష్ణారావు


ఏపీ ప్రభుత్వం జూన్ 2న తలపెట్టిన నవనిర్మాణ దీక్షలో హైదరాబాదులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పాల్గొనాలని సీఎస్ కృష్ణారావు తెలిపారు. ఉద్యోగులంతా ఆ రోజు విజయవాడకు రావాలని చెప్పారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో ఈరోజు కృష్ణారావు సమావేశమై చర్చించారు. అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ, ఉద్యోగులంతా నవనిర్మాణ దీక్షలో పాల్గొనడానికి సిద్ధం కావాలన్నారు. ఉద్యోగులు విజయవాడకు తరలి వెళ్లాలన్నారు. ఎవరైనా ఉద్యోగులకు విజయవాడకు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంటే సచివాలయం వద్ద చేపట్టే దీక్షలో పాల్గొనాలని తెలిపారు.

  • Loading...

More Telugu News