: బొక్కబోర్లా పడ్డ ఓఎన్జీసీ!


గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కమిషన్ (ఓఎన్జీసీ) నికర లాభం ఏకంగా 19.5 శాతం దిగజారింది. ఈ వార్త వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్లో కంపెనీ వాటా విలువ బొక్కబోర్లా పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక శాతానికి పైగా లాభపడ్డ సమయంలో ఒఎన్జీసీ ఈక్విటీ క్రితం ముగింపుతో పోలిస్తే 4.5 శాతం పడిపోయింది. కాగా, 2013-14 జనవరి - మార్చి మధ్య కాలంతో పోలిస్తే 2014-15లో సంస్థ నెట్ ప్రాఫిట్ రూ. 4,889 కోట్ల నుంచి రూ. 3,935 కోట్లకు తగ్గింది. నిర్వహణా వ్యయాలు పెరగడం, నిరుపయోగంగా ఉన్న బావులపై వెచ్చించిన ఖర్చును తొలగించడం కారణంగా ఆర్థిక గణాంకాలపై ప్రభావం పడిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ కె సరాఫ్ వ్యాఖ్యానించారు. సుమారు రూ. 291 కోట్లు వెచ్చించి జరిపిన చమురు బావుల తవ్వకాలు నిరుపయోగమైనాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News