: కెనెడియన్ గాయనికి చేదు అనుభవం
ప్రముఖ కెనెడియన్ గాయని సారా బ్లాక్ వుడ్ కి చేదు అనుభవం ఎదురైంది. తన రెండేళ్ల కుమారుడు ఏడుస్తుండటంతో... ఆమెను ఏకంగా విమానం నుంచి దింపేశారు. ఈ ఘటన శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో జరిగింది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వాంకోవర్ వెళుతుండగా, తన కుమారుడు ఎంతసేపటికీ ఏడుపు ఆపకపోవడంతో విమాన సిబ్బంది విసుగు చెందారని... దాంతో, తమను విమానం నుంచి దింపేశారని ఆమె ట్విట్టర్లో తెలిపారు. అయితే, విమాన సిబ్బంది తీరు పట్ల తోటి ప్రయాణికులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.