: ఎన్డీఏ ఏడాది పాలన ప్రజలకు సంతృప్తినిచ్చింది: వెంకయ్యనాయుడు


ఎన్డీఏ ఏడాది పాలన ప్రజలకు సంతృప్తినిచ్చిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఐదేళ్ల కోసం ప్రజలు తమకు అధికారం ఇచ్చారని అన్నారు. నూతన అధ్యాయం లిఖిస్తున్నామని, గత పదేళ్ల యూపీఏ పాలన అవలక్షణాలను తొలగిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో తమ ప్రభుత్వం సంవత్సర పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వెంకయ్య మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి అడుగు పేదరిక నిర్మూలన వైపేనని, పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ లక్ష్యమని వివరించారు. వచ్చే నెలలో స్మార్ట్ సిటీలు, అటల్ అమృత్, అందరికీ ఇళ్ల పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News