: టీఆర్ఎస్ ఎంపీ కవితపై ఏపీ మంత్రి సుజాత రుసరుస
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ కల్వకుంట్ల కవితపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత నిప్పులు చెరిగారు. మహానాడును 'డ్రామానాడు'గా కవిత అభివర్ణించడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ ఉదయం మహానాడు ప్రాంగణం వద్ద ఆమె మాట్లాడుతూ, తక్షణం కవిత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమాజమే దేవాలయం అన్నది తమ పార్టీ సిద్ధాంతమని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సహకారాన్ని టీఆర్ఎస్ కోరడం తెరచాటు రాజకీయాలకు నిదర్శనమని ఆమె విమర్శించారు. అమరావతిలో జగన్ తలపెట్టిన దీక్షను 'దొంగ దీక్ష'గా ఆమె అభివర్ణించారు.