: ఒక్క సెకనులో మాటిచ్చేసిన బాలయ్య: దర్శకుడు శ్రీవాస్


తాను దర్శకుడిగా మారినప్పటి నుంచి బాలకృష్ణతో సినిమా తీయాలని ఎన్నో సార్లు అనుకున్నానని, ఆ కల ఇన్నాళ్లకు నిజమైందని దర్శకుడు శ్రీవాస్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం బాలకృష్ణ 99వ చిత్రం లాంఛనంగా ప్రారంభమైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. లౌక్యం సినిమా తరువాత తాను బాలయ్యను కలిసి ఈ చిత్రం గురించి చెప్పగానే ఒక్క సెకనులో ఆయన మాటిచ్చేశారని, "నా 99వ సినిమాకు నువ్వే దర్శకుడివి" అని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నాడు. వాస్తవానికి 'లక్ష్యం' తరువాత ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించినా, అప్పట్లో కుదరలేదని శ్రీవాస్ వివరించాడు.

  • Loading...

More Telugu News