: మహానాడులో సందడి చేస్తున్న కేసీఆర్!
ఎప్పుడూ టీడీపీని తిడుతూ ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పసుపు పండుగైన మహానాడులో సందడి చేయడమేమిటి అనుకుంటున్నారా? ఇది నిజమే. మహానాడులో కేసీఆర్ సందడి చేస్తున్నారు. అయితే, ఆయన స్వయంగా మహానాడుకు రాలేదు. ఆయన ఫొటోలను మాత్రం ఫొటో ఎగ్జిబిషన్ లో పెట్టారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో చంద్రబాబు, కేసీఆర్ లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫొటో, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో వీరిద్దరూ కలుసుకున్న ఫొటోలను ఎగ్జిబిషన్ లో ఉంచారు. ఈ ఫోటోలు టీడీపీ కార్యకర్తలను బాగా ఆకర్షిస్తున్నాయి.