: జూన్ 2న ఏపీ నవనిర్మాణ దీక్ష... 3వ తేదీ నుంచి జన్మభూమి కార్యక్రమం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావించే జన్మభూమి కార్యక్రమం ఏపీలో మళ్లీ మొదలుకానుంది. జూన్ 3వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతుందని ఆ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అదనంగా లక్షన్నర పింఛన్లను అందజేస్తామని చెప్పారు. జన్మభూమిలో భాగంగా అధికారులే ప్రజల వద్దకు వెళతారని... ప్రజల, గ్రామ సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించమని అన్నారు. జూన్ 2న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నవనిర్మాణ దీక్ష చేపడతామని దేవినేని తెలిపారు. ఈ దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా హాజరవుతారని చెప్పారు.