: కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్
గురువారం అర్ధరాత్రి కారు బాంబు పేలుళ్లతో ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్ దద్దరిల్లింది. నిమిషాల వ్యవధిలో బాంబు పేలుళ్లు జరిగాయని, ఈ ఘటనల్లో 10 మంది మృతి చెందగా, 27 మంది వరకూ గాయపడ్డారని అధికారులు వివరించారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్టు తెలిపారు. కాగా, తొలి పేలుడు సెంట్రల్ బాగ్దాద్ లోని బాబ్లీ హోటల్ వద్ద జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదు నిమిషాల తరువాత క్రిస్టల్ హోటల్ వద్ద మరో కారులో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చారు. ఈ పేలుడులో నలుగురు మరణించారు. ఇరాక్ లో జరుగుతున్న ఉగ్ర ఘటనల కారణంగా ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకూ 5,500 మందికి పైగా మరణించారు.