: తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో మోడల్ ప్రియాంకా సింగ్ కు జీవిత ఖైదు


కన్నవారని కూడా చూడకుండా అత్యంత దారుణంగా తన తల్లిదండ్రులను హత్య చేసిన కేసులో మాజీ మోడల్ ప్రియాంకా సింగ్ కు మీరట్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు వివరాల్లోకి వెళితే, 2008 నవంబర్ 11న తన స్నేహితురాలు అంజూ సహాయంతో ప్రియాంక తన తల్లిదండ్రులు ప్రేమ్ వీర్ సింగ్, సంతోష్ సింగ్ లను కత్తితో పొడిచి హత్య చేసింది. నిత్యమూ ఆస్తి తగాదాలు పెట్టుకుంటూ, తనను సరిగ్గా పట్టించుకోక పోవడంతోనే ఈ పని చేసినట్టు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. కేసు విచారణ ఎనిమిదేళ్లు సాగింది. ఈ కేసులో ప్రియాంకతో పాటు ఆమెకు సహకరించిన అంజూకు సైతం జీవిత ఖైదు పడింది. ఇద్దరూ చెరో రూ. 25 వేలు జరిమానా కట్టాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.

  • Loading...

More Telugu News