: పంతం నెగ్గించుకున్న గుజ్జర్లు... ఆందోళన నిలిపివేత


ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనంటూ పెను ఆందోళన చేపట్టిన గుజ్జర్లు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. వారికి 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం అంగీకరించడంతో ఆందోళనను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, గడచిన 8 రోజులుగా గుజ్జర్లు చేపట్టిన ఆందోళనతో వందలాది రైళ్లు నిలిచిపోగా, భారత రైల్వేలకు రూ. 100 కోట్లకు పైగానే నష్టం వాటిల్లింది. జైపూర్, ఆగ్రా జాతీయ రహదారిపై వాహన రాకపోకలు నిలిచి పెను నష్టం వాటిల్లింది. హైకోర్టు కల్పించుకుని రాష్ట్ర సీఎస్, డీజీపీలకు మొట్టికాయలు వేసింది. వీరి ఆందోళనను అడ్డుకునేందుకు కేంద్రం 4,500 మంది పారామిలటరీ దళాలను పంపగా, అత్యంత సంఘటితంగా ఉండే గుజ్జర్లతో పోరు ఎందుకులే అనుకున్న రాష్ట్ర సర్కారు దిగివచ్చినట్టు తెలుస్తోంది. వీరి రిజర్వేషన్లపై తదుపరి అసెంబ్లీ సెషన్ లో బిల్లు పెడతామని ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News