: ఇలా భిక్షాటన ఎందుకు, బాబూ?...అదొక్కటీ సాధించు సరిపోతుంది: సీపీఐ నారాయణ


ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, తెల్లారి లేచింది మొదలు బాబు దేశాలు పట్టుకుని తిరుగుతూ, పెట్టుబడులు పెట్టండని భిక్షాటన చేయడం ఎందుకోసమని నిలదీశారు. ప్రత్యేక హోదా సాధించుకుంటే ఇలా భిక్షాటన చేయాల్సిన అవసరం ఉండదని, పెట్టుబడులు వాటంతట అవే వస్తాయని అన్నారు. బాబుకు నిజంగా ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంలో పదవులు వదులుకుని, హోదా కోసం పోరాడాలని ఆయన సూచించారు. మహానాడు ఆర్భాటం మొత్తం లోకేష్ కోసమేనని ఆయన దుయ్యబట్టారు. మహానాడు వల్ల లోకేష్ కు తప్ప తెలుగు ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్యనాయుడుని అంతా మాటమార్చిన వెంకయ్యగా అభివర్ణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలో ఉన్నప్పుడు మరొకమాట మాట్లాడే వ్యక్తిగా చూస్తున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News