: టీమిండియాకు కోచ్ ఎందుకు?... దండగ!: కపిల్ దేవ్
టీమిండియా కొత్త కోచ్ పై భారత క్రికెట్లో చర్చ నడుస్తోంది. డంకన్ ఫ్లెచర్ వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతుండగా, దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాత్రం అసలు భారత జట్టుకు కోచ్ ఎందుకు? అని ప్రశ్నిస్తున్నాడు. డబ్బు వృథా అని అభిప్రాయపడ్డాడు. జట్టులో స్టార్లు ఉండగా కోచ్ తో పనేంటని, ధోనీ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లే జట్టును నడిపించగలరని అన్నాడు. జట్టులో ఉన్న యువ ఆటగాళ్లకు దిశానిర్దేశం చేయగలిగితే చాలని పేర్కొన్నాడు. టీమిండియా కోచ్ కోసం బీసీసీఐ టైమ్ వేస్ట్ చేస్తోందని విమర్శించాడు. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టీమిండియాకు హెడ్ కోచ్ గా ఎవరిని నియమిస్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని హై పెర్ఫార్మెన్స్ మేనేజర్ గా నియమిస్తారని క్రికెట్ వర్గాల్లో విశేషంగా ప్రచారమవుతోంది.