: ఈ ఏడాది అమెరికా వీసాకి 90 వేల మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేశారు
ఈవేళ మన కుర్రాళ్లలో చాలా మంది ఏదో ఒక రూపంలో అమెరికాకి వెళ్లాలని చూస్తున్నారు. విదేశీ విద్య, ఉద్యోగం, సంపాదన మోజులో భారతీయులు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది స్టూడెంట్ వీసా కోసం 90 వేల మంది భారతీయులు అమెరికాకు దరఖాస్తు చేయడం చూస్తుంటే, విదేశీ విద్యపై మన మోజు తెలుస్తుంది. అయితే, ఈ 90 వేల మందిలో కేవలం నాలుగు వేల మందికి మాత్రమే వీసా ఇచ్చినట్టు అమెరికా వెల్లడించింది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న వారిలో చైనా తరువాతి స్థానం భారతీయులదే. ఈ ఏడాది 70 శాతం వీసా దరఖాస్తులు పెరిగాయని, ముంబై, హైదరాబాదుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయని అమెరికా దౌత్యాధికారులు వెల్లడించారు.