: బాధ్యతల నుంచి తప్పుకున్న టీమిండియా ఫిజియో


టీమిండియా చీఫ్ ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. టీమిండియాకు సుదీర్ఘ కాలం సేవలందించిన సహాయక సిబ్బందిలో పటేల్ కూడా ఒకరు. 2007లో ఇంగ్లండ్ టూర్ సందర్భంగా ఆయన భారత జట్టుతో కలిశారు. జాన్ గ్లోస్టర్ స్థానంలో పటేల్ బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఫీల్డింగ్ సెషన్ లో మోచేయి విరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. ఏళ్లుగా టీమిండియా విజయాలకు తెరవెనుక పాత్రధారుల్లో ఒకడిగా, మ్యాచ్ కు ఆటగాళ్లను శారీరకంగా సన్నద్ధం చేసే నిపుణుడిగా పటేల్ కీలకపాత్ర పోషించారు. టీమిండియాకు బీసీసీఐ కొత్త కోచ్ ను అన్వేషిస్తున్న తరుణంలో, పటేల్ వైదొలగడంతో కొత్త ఫిజియోను కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.

  • Loading...

More Telugu News