: రాహుల్! ముందు అధ్యయనం చెయ్యడం నేర్చుకో: వెంకయ్యనాయుడు
'ఏదయినా మాట్లాడేముందు కొంత అధ్యయనం చెయ్' అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సలహా ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ చేసిన విమర్శలపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు పార్లమెంటుకు వస్తాడో, ఎప్పుడు సెలవు మీద వెళ్తాడో తెలియని రాహుల్ చెబితే నేర్చుకునే స్థితిలో లేమని అన్నారు. రాహుల్ గాంధీ గడచిన పదేళ్లలో ఎన్నిసార్లు పార్లమెంటుకు హాజరై అధ్యయనం చేశారో గుర్తు చేసుకోవాలని ఆయన చురకంటించారు.